: మళ్ళీ విశాఖ వెళ్ళనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విశాఖపట్నం వెళ్ళనున్నారు. ఈ సాయంత్రమే ఆయన విశాఖ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు. ఈ నెల 21న బాబు తొలుత విజయవాడ వెళతారు. అక్కడ పోలీసు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖ బయల్దేరి వెళతారు. అదే రోజున అక్కడ జరిగే ఆత్మవిశ్వాస ర్యాలీలో పాల్గొంటారు. ఈ నెల 22,23 తేదీల్లో బాబు విశాఖలోనే ఉంటారు.