: రెండు రాష్ట్రాల సీఎంలను ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
మహారాష్ట్ర, హర్యానాల్లో సీఎంలను ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో సీఎంల ఎంపిక, పార్టీల మద్దతు తీసుకునే విషయంపై చర్చించనున్నారు.