: మళ్ళీ సీఎం పీఠం అధిష్ఠించాలంటూ జయకు మేనక లేఖ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కేంద్ర మంత్రి మేనకా గాంధీ లేఖ రాశారు. అన్ని కష్టాలను అధిగమించి మళ్ళీ సీఎం పీఠం అధిష్ఠించాలని కోరుకుంటున్నట్టు మేనక తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయకు తన సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో సంఘీభావం ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు క్రమశిక్షణ, గుండెనిబ్బరంతో సమస్యలను అధిగమించారంటూ కొనియాడారు.