: బాబు పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరున్నర నెలలుగా అలుపెరుగకుండా కొనసాగిస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. చివరి రోజున విశాఖలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు ఈ నెల 27న ఈ సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. కాగా, సభ విజయవంతం చేసేందుకు ఓ ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ సభకు సంబంధించిన వివరాలను విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. చారిత్రాత్మక 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ముగింపునకు గుర్తుగా విశాఖలో ఓ పైలాన్ ను బాబు ఆవిష్కరిస్తారని, అనంతరం 10 వేల వాహనాలతో భారీ ర్యాలీతో సభా వేదిక వద్దకు ఆయనను తోడ్కొనిపోతామని గణేశ్ తెలిపారు.

  • Loading...

More Telugu News