: ప్రజల తీర్పును మేం శిరసావహిస్తున్నాం: రాహుల్ గాంధీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కుదేలవడం పట్ల వ్యాఖ్యానిస్తూ, హర్యానాలో ప్రజలు పాలన మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని స్పష్టం చేశారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 15 మాత్రమే నెగ్గింది. అటు, బీజేపీ 47 స్థానాలు నెగ్గి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News