: మా అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదనే క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాం: బాలకృష్ణ
హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నేడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతోనే క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించామని తెలిపారు. ఈ ఆసుపత్రిని ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దుతామని బాలయ్య చెప్పారు. పేదలకు ఉచిత చికిత్స అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.