: మహారాష్ట్రలో దారుణ ఫలితాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ మాణిక్ రావ్ రాజీనామా


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ మాణిక్ రావ్ ఠాక్రే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపానని ఈ సందర్భంగా ఠాక్రే తెలిపారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రస్తుతం కాంగ్రెస్ 25 స్థానాల్లో నెగ్గి, మరో 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, బీజేపీ 66 స్థానాలను కైవసం చేసుకుని మరో 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివసేన పార్టీ 29 స్థానాల్లో గెలిచి, మరో 28 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్సీపీ 21 స్థానాలు కైవసం చేసుకుని, 22 స్థానాల్లో అధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News