: చెట్లను నరికే అత్యాధునిక యంత్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో నేడు కూడా తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన చెట్లను నరికివేసే అత్యాధునిక యంత్రాన్ని ప్రారంభించారు. ఆంధ్రా యూనివర్శిటీని సందర్శించిన బాబు, అక్కడ పడిపోయిన చెట్ల కొమ్మలను రంపంతో కోశారు. అంతకుముందు, తుపాను సహాయక చర్యలపై విశాఖ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారంటూ ఎన్డీఆర్ఎఫ్, టీడీపీ బృందాలను ఈ సమావేశంలో అభినందించారు.