: ఓటమిని అంగీకరించిన హర్యానా సీఎం
హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. మునుపటి ఎన్నికల్లో తాము (కాంగ్రెస్) గెలిస్తే, ఈసారి బీజేపీ హవా కొనసాగుతోందని అన్నారు. ఎక్కడైనా గెలుపోటములు సహజమని అభిప్రాయపడ్డారు. తమ పాలనలో జరిగిన అభివృద్ధిని కొత్త ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలని హుడా ఆకాంక్షించారు. అయితే, బీజేపీ జోరుకు ప్రధాని మోడీయే కారణమనడాన్ని ఆయన వ్యతిరేకించారు.