: తుపాను మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులిచ్చిన రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామంలో తుపాను బాధితులను పరామర్శించారు. తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. ఏ కష్టమొచ్చినా తొలుత పేదవాడే నష్టపోతున్నాడని ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందేంతవరకు కేంద్రంతో పోరాడతామని హామీ ఇచ్చారు.