: హర్యానాలో బీజేపీ హవా
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 90 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రస్తుతం బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకుంది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ 14 స్థానాలు గెలుకుచుకుని, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్ డీ పార్టీ 19 స్థానాల్లో నెగ్గి, మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.