: హర్యానా సీఎం రేసులో ఉన్న బీజేపీ అభ్యర్థులు వీరే!


హర్యానాలో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది బీజేపీ. అధికార పీఠం ఖాయమైన నేపథ్యంలో, హర్యానాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సీఎం ఎంపిక విషయంలో కులం కూడా ప్రాధాన్యత వహించే అవకాశాలున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి రేసులో పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అభిమన్యు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు సుష్మాస్వరాజ్, ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్, బీజేపీ హర్యానా అధ్యక్షుడు రాంవిలాస్ శర్మలు సీఎం రేసులో ఉన్నారు.

  • Loading...

More Telugu News