: విశాఖ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన షురూ


హుదూద్ తుపాను ప్రభావిత విశాఖ ప్రాంతాల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. స్టీల్ ప్లాంటుకు వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ వాసుల కష్టాలను స్వయంగా చూసేందుకే ఇక్కడకు వచ్చానని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తాటిచెట్ల గ్రామానికి రాహుల్ బయలుదేరారు. అక్కడ తుపాను బాధితులను ఆయన పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News