: దేవేంద్ర ఫడ్నవిస్ ఘన విజయం... నారాయణ రాణే పరాజయం


మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 44,821 ఓట్ల మెజారిటీతో విజయదుంధుభి మోగించారు. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఫడ్నవిస్ పోటీ చేశారు. బీజేపీ తరపున ఫడ్నవిస్ సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుదాల్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. శివసేన అభ్యర్థి వైభవ్ నాయక్ చేతిలో 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

  • Loading...

More Telugu News