: హంగ్ దిశగా మహారాష్ట్ర... బీజేపీతో జతకట్టనున్న శివసేన?... రంగంలోకి మోడీ


మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తున్నప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ ఆ పార్టీకి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. 288 స్థానాల్లో 111 స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. మరోవైపు ఒంటరిగానే బరిలో దిగి అధికారం పీఠంపై కూర్చోవాలని భావించిన శివసేన 58 స్థానాల్లో ఆధిక్యం సంపాదించి రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన పార్టీలు మరింత వెనుకంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో సంకీర్ణ (హంగ్) ప్రభుత్వం ఏర్పడబోతోంది. అయితే, బీజేపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రంగంలోకి ప్రధాని మోడీ దిగారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో చర్చించే బాధ్యతను బీజేకీ కీలక నేత నితిన్ గడ్కరీకి మోడీ అప్పగించినట్టు సమాచారం. మరోవైపు విపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమంటూ ఎన్సీపీ సంకేతాలు పంపుతోంది.

  • Loading...

More Telugu News