: ఇది మోడీ విజయం: షానవాజ్ హుస్సేన్


రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోతోంది. హర్యానాలో క్లీన్ మెజారిటీ దిశగా సాగిపోతుండగా... మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. వెలువడుతున్న ఫలితాలపై బీజేపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మోడీ విజయమని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి ఈ ఫలితాలు ఒక ఉదాహరణ అని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల్లో అధికారం చేపడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News