: ముందంజలో ఉన్న ప్రముఖులు ఎవరు?... ఓటమి బాటలో ఎవరు?


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో రౌండు ఫలితాలు వెలువడుతున్న కొద్దీ నేతల తలరాతలు కూడా తలకిందులవుతున్నాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ లో మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే ఓటమి ముంగిట నిలిచారు. అలాగే, హర్యానాలో ఐఎన్ఎల్డీ చీఫ్ అశోక్ అరోరా కూడా వెనుకబడ్డారు. ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దాదాపు 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావూ సాహెబ్ షెకావత్ కూడా కూడా వెనుకంజలో ఉన్నారు. మాజీ సీఎం నారాయణ రాణే కూడా వెనుకబడ్డారు. ఇక ఆధిక్యంలో కొనసాగుతున్న వారి విషయానికొస్తే... మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ (ఎన్సీపీ), మాజీ మంత్రులు ఆర్ఆర్ పాటిల్, ఛగన్ భుజ్ బల్, అశోక్ చవాన్ భార్య అమృతా చవాన్, గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే, హర్యానాలో సుష్మాస్వరాజ్ సోదరి వందనా శర్మ ముందంజలో ఉన్నారు.

  • Loading...

More Telugu News