: ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా


కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పాటు, వరుసగా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆ పార్టీలోని మెజారిటీ నేతలు, కార్యకర్తలు నమ్మకం కోల్పోతున్నారు. ఈ క్రమంలో, ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీని తప్పించి ప్రియాంకకు అప్పగించాలని వీరు డిమాండ్ చేశారు. ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించకపోతే... కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమవుతుందని వీరు అంటున్నారు.

  • Loading...

More Telugu News