: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారులపై ఉక్కుపాదం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, అధిక ధరలకు అమ్ముకునే వ్యాపారులను సహించమని ఏపీ ప్రభుత్వం చేసిన హెచ్చరికలు కార్యరూపం దాల్చాయి. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 25 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు, రేషన్ డీలర్ల చేతివాటంపై కూడా 26 కేసులు నమోదయ్యాయి. హుదూద్ తుపాను బాధితులు 17.41 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం తేల్చింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 50 శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తయింది.