: మహారాష్ట్ర పీఠం బీజేపీదే: ఫడ్నవిస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. అయితే, సీఎం రేసులో తానున్నానన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి రేసులో ఎవరూ లేరని... పార్టీ అధిష్ఠానం, ప్రజాభిప్రాయం మేరకు సీఎం నియామకం ఉంటుందని చెప్పారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫడ్నవిసే ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.