: జీతాలు పెంచండి: కేసీఆర్ కు పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తి


తెలంగాణ రాష్ట్ర పోలీసుల జీతాలు, అలవెన్సులు పెంచాలని ఆ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి వినతి పత్రం అందజేసింది. వారంతపు సెలవులు, సిబ్బందికి ఇళ్ల స్థలాలు, పీఎస్ లలో కానిస్టేబుళ్లకు ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. తమ విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News