: మళ్లీ గ్యాస్ కూ, ఆధార్ కూ లింక్
గ్యాస్ సిలిండర్లను ఆధార్ కార్డుతో లింక్ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లపై నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నవంబర్ 10 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ... కొన్ని రోజుల తర్వాత రద్దు చేసింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ఆ పథకాన్ని పున:ప్రారంభించబోతోంది.