: దేవినేని ఉమ నాకు ఫోన్ చేయనేలేదు: హరీష్ రావు
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని కోరుతూ ఏపీ మంత్రి దేవినేని ఉమ తనకు ఫోన్ చేయనేలేదని టీఎస్ మంత్రి హరీష్ రావు తెలిపారు. అయినా, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని... విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని... ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి ఆపలేమని చెప్పారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం 350 మెగావాట్ల విద్యుత్ అందజేస్తే అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. తమ రైతుల రెండో పంట గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంటే... మా రైతుల మొదటి పంట గురించి మేము ఆలోచిస్తున్నామని హరీష్ అన్నారు. రాయలసీమకు నీటి కొరత రాకుండా ఉండేందుకు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే.