: లీటరుకు రూ. 3.37 తగ్గిన డీజిల్ ధర
డీజిల్ ధర లీటరుకు రూ. 3.37 తగ్గింది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా డీజిల్ ధరపై ఉన్న నియంత్రణను ఎత్తి వేస్తున్నట్టు, మార్కెట్ ధరకే డీజిల్ ను అమ్మనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.