: వైకాపా ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఐజయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐజయ్య ఎస్సీ కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి గుంపుల రవికుమార్ రాజు కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఐజయ్యకు నోటీసులు జారీ చేస్తూ... తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.