: రేపు తేలిపోనున్న మహారాష్ట్ర, హర్యానా నేతల భవితవ్యం


రేపు ఉదయం 8 గంటల నుంచి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో, ఈ రెండు రాష్ట్రాల నుంచి బరిలోకి దిగిన మహామహుల భవితవ్యం రేపు తేలిపోనుంది. అంతేకాకుండా, మహారాష్ట్రలో ఊహించని విధంగా పొత్తులను తెగదెంపులు చేసుకుని అన్ని ప్రధాన పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. హర్యానాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. దీంతో, ఎన్నికల ఫలితాల అనంతరం, ఏయే పార్టీలు చేతులు కలుపుతాయో, ఎవరు పీఠమెక్కుతారో అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

  • Loading...

More Telugu News