: ఏపీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: తెలంగాణ ఐఎంఏ
హుదూద్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నిరాశ్రయులుగా మారిన విశాఖ ప్రజలకు కావల్సిన అన్ని సహాయ కార్యక్రమాలను అందిస్తామన్నారు. ఇప్పటికే ఏపీ మెడికల్ అసోసియేషన్ కు తమ సుముఖతను తెలియజేశామని చెప్పారు. ఎలాంటి సాయం అడిగినా తక్షణమే స్పందిస్తామని పేర్కొన్నారు. సేవ, వైద్య, ఆర్థిక సాయం అందించేందుకు ఇప్పటికే పది టీమ్ లను సిద్ధం చేశామని ఛైర్మన్ తెలిపారు.