: అప్పుడు వెలికి తీస్తానన్న మోడీ... ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు: నితీష్
ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించడానికి ఎల్లప్పుడూ ముందుండే బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి నోటికి పని చెప్పారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించిన మోడీ... ఇప్పుడు అన్నింటికీ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే నల్ల ధనాన్ని వెలికితీస్తానని చెప్పిన మోడీ... ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.