: చంద్రబాబుపై ధ్వజమెత్తిన శైలజానాథ్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి ఏం చేస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించడం పార్టీ నేతల బాధ్యత అని అన్నారు. పెను తుపాను రాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ... ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతటి నష్టం వాటిల్లేది కాదని అన్నారు. తుపాను అంశాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News