: ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్న జయ
బెయిల్ పై పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేరుగా చెన్నై బయలుదేరనున్నారు. జయ ప్రయాణం కోసం బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఇప్పటికే ప్రత్యేక విమానం ఎదురుచూస్తోంది. జయకు ఘన స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు చెన్నైలోని జయ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. భారీ సెక్యూరిటీ, కాన్వాయ్ మధ్య పరప్పన అగ్రహారం జైలు నుంచి విమానాశ్రయానికి జయ బయలుదేరారు.