: జైలు నుంచి విడుదలైన జయలలిత
పురచ్చితలైవి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నుంచి విడుదలయ్యారు. పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న జయకు సుప్రీంకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి (22 రోజులు) జయ జైలులో ఉన్నారు. జయలలిత విడుదలతో జైలు పరిసర ప్రాంతాల్లో భారీసంఖ్యలో గుమిగూడిన ఏఐఏడీఎంకే కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరోవైపు, చెన్నై విమానాశ్రయం నుంచి జయ నివాసం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు సన్నాహకాలు చేశారు.