: ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్
తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య దీనికి సంబంధించి ఒప్పందం జరగనుంది. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటికే విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రానికి స్వల్ప ఊరట కలగనుంది.