: శబరిమల ఆలయానికి నూతన ప్రధాన అర్చకుడు


కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ నూతన ప్రధాన అర్చకుడిగా ఈఎన్ కృష్ణదాస్ నంబూద్రి నియమితులయ్యారు. పక్కనే ఉన్న మలికప్పురం దేవి ఆలయానికి కూడా ముఖ్య పూజారిగా ఎస్.కేశవన్ నంబూద్రిని నియమించారు. పలువురి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి వారిద్దరిని తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. నవంబర్ నుంచి శబరిమల తీర్థయాత్ర ప్రారంభమవనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆలయాలకు కొత్త అర్చకులను తీసుకున్నారు.

  • Loading...

More Telugu News