: సహకార చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేయడం టీడీపీకీ మామూలే: జగన్


సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను తక్కువ ధరలకే అమ్మేయడం టీడీపీ ప్రభుత్వానికి మామూలేనని వైెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శనివారం విశాఖలోని తుమ్మపాల ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చెరకు రైతులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం సహకార రంగంపై వ్యవహరిస్తున్న తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు. లాభాల్లో నడుస్తూ చెరకు రైతులకు అండగా నిలుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీలను నష్టాల బాట పట్టించడం టీడీపీ సర్కారుకు అలవాటేనని ఆయన ఆరోపించారు. నష్టాల బాట పట్టిన తర్వాత ఆయా చక్కెర ఫ్యాక్టరీలను తక్కువ ధరలకే తెగనమ్మడం కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మామూలేనని ఆయన ఆరోపించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని కేవలం రూ.4 కోట్లకు విక్రయించేందుకు టీడీపీ ప్రభుత్వం యత్నించగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News