: హైదరాబాదులోని ప్రముఖ పార్క్ కు అంజయ్య పేరు పెడతాం: కేసీఆర్
హైదరాబాదులోని ఓ ప్రముఖ ఉద్యానవనానికి టంగుటూరి అంజయ్య పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అంజయ్య 28వ వర్థంతి సందర్భంగా నగరంలోని లుంబినీ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అంజయ్య విగ్రహాన్ని ముషీరాబాద్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన సేవలు గుర్తుండేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.