: తల్లిదండ్రుల్ని బాయ్ ఫ్రెండ్ తో కలిసి చంపేసింది


సమాజంలో బంధాలు ఎంత బలహీనంగా మారుతున్నాయో తెలియజేసే సంఘటన ఇది. మహారాష్ట్రకు చెందిన శ్రీహరి వినోద్ (63), స్నేహ (60) దంపతులు పిల్లలు లేకపోవడంతో ఏడాది వయసున్న అమ్మాయిని 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. తరువాత వారు గుజరాత్ లోని బరోడాలోని తిరుపతి సొసైటీ ప్రాంతానికి వచ్చేశారు. ఆ బాలిక ఇప్పుడు పదోతరగతి చదువుతోంది. తాళం వేసి ఉన్న వారి ఇంట్లోంచి భరించలేని దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు సాక్షాత్కరించాయి. ఆ తల్లిదండ్రులు శవాలుగా పడివున్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దత్తత అమ్మాయే వారిని చంపేసిందన్న నిజం బయటపడింది. ఆగస్టు మూడో తేదీన ఆ బాలిక తన బాయ్ ఫ్రెండ్ సంజయ్ పురి (21)తో కలిసి తల్లిదండ్రుల్ని మట్టుబెట్టింది. తనను కొట్టేవారని, తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చదివించేవారని అందుకే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వారిని చంపేశానని బాలిక తెలిపింది. చంపేసిన తరువాత ఏం చేయాలో తెలీక వారి శవాలను ఓ గదిలో పెట్టి తాళం వేశానని, దుర్వాసన వస్తుండడంతో తన బాయ్ ఫ్రెండ్ సెంటు చల్లివెళ్లేవాడని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

  • Loading...

More Telugu News