: అమెరికా అధ్యక్షుడి క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయింది!


క్రెడిట్ కార్డులతో మోసపోతున్న కాలం ఇది. సాధారణ ప్రజానీకానికి అది మామూలే కావచ్చు. కానీ, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడికే ఇలా జరిగితే? తాజాగా బరాక్ ఒబామా తన క్రెడిట్ కార్డు విషయంలో ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా ఇటీవల న్యూయార్క్ వెళ్లారు. అక్కడ భార్య మిచెల్లీతో కలసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. బిల్ కట్టేందుకు తన క్రెడిట్ కార్డు ఇవ్వగా హోటల్ వారు తిరస్కరించారు. దాంతో షాక్ అయిన అధ్యక్షుడు అయోమయంలో పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కన్య్సూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో వెల్లడించింది. అయితే, తానంతగా కార్డును ఉపయోగించకపోయినా ఏదో మోసం జరిగిందనుకుంటున్నానని, లక్కీగా మిచెల్లీ కార్డు బాగానే ఉందని నవ్వుతూ అధ్యక్షుడు అన్నట్లు చెప్పింది. కార్డు రిజెక్ట్ అయిన సమయంలో వెయిటర్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశానని, తన బిల్లుల పేమెంట్ విషయంలో ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదన్నారట. చివరకు తాను దాని బారిన పడ్డానని ఒబామా అన్నట్లు ప్రొటెక్షన్ బ్యూరో వివరించింది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం క్రెడిట్ కార్డులకు 'చిప్ అండ్ పిన్' తరహా రక్షణ కల్పించే ఉత్తర్వులపై అధ్యక్షుడు సంతకం చేశారట.

  • Loading...

More Telugu News