: ప్రధాని మోడీ నేతృత్వంలో అణ్వస్త్ర భద్రతపై ప్రత్యేక మండలి!


అణ్వస్త్ర భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో త్వరలో ప్రత్యేక మండలి ఏర్పాటు కానుంది. దీని ద్వారా దేశంలోని న్యూక్లియర్ రియాక్టర్ల వద్ద కొత్తగా భద్రత ప్రమాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో భాగంగా న్యూక్లియర్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్ఎస్ఆర్ఏ) బిల్లుకు కేంద్రం త్వరలోనే ఆమోదం తెలపనుంది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పార్లమెంటులో బిల్లుకు ఆమోదంతో ఎన్ఎస్ఆర్ఏ, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్ఏ) స్థానంలో కొత్తగా అమలులోకి రానుంది. దీంతో ఏఈఆర్ఏ రద్దైపోతుంది. అణు రియాక్టర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఎన్ఎస్ఆర్ఏ చర్యలు చేపట్టనుంది.

  • Loading...

More Telugu News