: ఒంటరితనంతో బాధపడుతున్నారా?...అయితే, ఈ కుర్చీ కొనుక్కోండి!


ఇక్కట్లలో ఉన్నవారు, ఏకాంతం అనుభవిస్తున్నవారు, ఎవరైనా తమను అక్కున చేర్చుకుంటే చాలు అని భావించే వారికోసం జపాన్ కు చెందిన యూనికేర్ సంస్ధ ఓ ఆత్మీయ కుర్చీని తయారు చేసింది. అందులో కూర్చుంటే సాంత్వన చేకూరుతుందని, ఒంటరితనం పోతుందని, తమతో ఎవరో ఉన్న అనుభూతి కలుగుతుందని ఆ సంస్థ చెబుతోంది. ఈ కుర్చీ మనిషిని పోలి వుంటుంది ఇందులో నడుం వాల్చగానే, దానికున్న రెండు చేతులను భుజం మీద కానీ, నడుం చుట్టూకానీ వేసుకుంటే మనతో ఎవరో ఉన్నారనే ఫీల్ కలుగుతుందని, తద్వారా ఒంటరితనం బాధ పోతుందని కుర్చీ రూపకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వృద్ధులకు ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారికీ ఇది ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీని ధర అక్షరాల 25 వేల రూపాయలు. ఒంటరితనం పోగొట్టుకునేందుకు ఆమాత్రం ఖర్చు చేయాలేమో!

  • Loading...

More Telugu News