: మా హీరోలు గ్రేట్... సినిమా కుటుంబాలను దత్తత తీసుకుంటా: దాసరి
హుదూద్ తుపాను బాధితులకు అండగా నిలవడంలో తెలుగు సినీ పరిశ్రమ చక్కగా స్పందించిందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణంలో తుపాను ప్రభావంతో నష్టపోయిన సినీ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటానని అన్నారు. ఇప్పటికే వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపిన ఆయన, వారికి నేరుగా సాయం అందజేస్తానని తెలిపారు. తమను ఆదరిస్తున్న ప్రజలను ఆదుకునేందుకు మేమున్నామంటూ తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినీ తారలే కాకుండా, తమిళ, బాలీవుడ్ తారలు కూడా స్పందించడం హర్షణీయమని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు.