: ఒకే ఇంట్లోంచి ముగ్గురు మంత్రులు కావచ్చా?... ఇద్దరుంటే పింఛనివ్వరా?: సీతక్క


ఒకే కుటుంబంలోంచి ముగ్గురు వ్యక్తులు మంత్రులు కావొచ్చు కానీ, ఒకే కుటుంబంలో పింఛనుకు మాత్రం ఒక్కరే అర్హులా? ఇదెక్కడి న్యాయం? అంటూ తెలంగాణ టీడీపీ మహిళా నేత సీతక్క ప్రశ్నించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఆహార భద్రత పేరిట ఎంతమందిని బలితీసుకుంటారని నిలదీశారు. గతంలో చేసిన సర్వేల వివరాలన్నీ ఏమయినట్టని ఆమె ప్రశ్నించారు. గతంలో తెలంగాణను స్థంభింపజేసి చేసిన సర్వేపై నమ్మకం లేక మరోసారి దరఖాస్తులు అడుగుతున్నారా? లేక ప్రజలను కష్టపెట్టాలనా? అని ఆమె కడిగేశారు. ప్రజలను ఎన్ని ఇక్కట్లపాలు చేస్తారని ప్రశ్నించిన ఆమె, అధికారులను ఎందుకు ఇబ్బందిపెట్టడం లేదని అన్నారు. ప్రభుత్వమంటే ప్రజా సంక్షేమం చూడాలి తప్ప ప్రజలను వేధించకూడదని ఆమె హితవు పలికారు.

  • Loading...

More Telugu News