: మహారాష్ట్ర, హర్యానా సీఎంల రేసులో జవదేకర్, సుష్మా
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు కీలక శాఖలను నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, సుష్మా స్వరాజ్ లు తాజాగా మహారాష్ట్ర, హర్యానా సీఎంల రేసులో దూసుకుపోతున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ దిశగా సాగుతున్న బీజేపీ రెండు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు కాబోయే బీజేపీ ప్రభుత్వాలకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు కాబోయే బీజేపీ ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాలకు చెందిన స్థానిక నేతలే నేతృత్వం వహిస్తారన్న ప్రచారం సాగగా, తాజాగా శుక్రవారం కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, సుష్మా స్వరాజ్ ల పేర్లు వెలుగు చూశాయి. మహరాష్ట్రలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి జవదేకర్, హర్యానా ప్రభుత్వానికి సుష్మా నేతృత్వం వహిస్తారన్న వదంతులతో స్థానిక నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.