: హైదరాబాదులో ఇకపై భోజనం 5 రూపాయలే!


సాధారణంగా 5 రూపాయలకు బహిరంగ మార్కెట్లో తినేందుకు ఏమొస్తుంది? ఓ బన్, కాకా హోటల్ లో టీ, సమోసా వస్తాయేమో! ఇకపై హైదరాబాదులో 5 రూపాయలకు భోజనం లభించనుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్‌తో కలసి కేంద్ర గ్రంధాలయంలో 5 రూపాయలకే భోజనం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హరేకృష్ణ మూవ్‌మెంట్ వారి సహకారంతో జీహెచ్‌ఎంసీ సౌజన్యంతో కేవలం 5 రూపాయలకే భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఇలాంటి భోజనం హైదరాబాదులోని 15 సెంటర్లలో అందిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదు నగరంలో ఉపాధి, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారని, వారందరికీ నామమాత్రపు ధరకు ఆహారం అందించాలనే సదుద్దేశంతో ఈ పథకం ప్రారంభించామని వారు పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలకు సరిపడా సంపాదన ఉండదనే ఉద్దేశంతో, వారికి మేలు చేయాలనే లక్ష్యంతో ముందుగా గ్రంథాలయంలో ఈ పథకం ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజూ 500 మందికి భోజన సదుపాయం సమకూరేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. అవసరమైతే వెయ్యి మందికి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News