: నేడే జైలు నుంచి జయ విడుదల!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేడు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్నారు. శుక్రవారమే ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందలేదు. అంతేకాక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టుకు పూచీకత్తు కూడా సమర్పించాల్సి ఉంది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చేతికందిన తర్వాత కాని పూచీకత్తు సమర్పణ కుదరదు. దీంతో శుక్రవారమే జయకు బెయిల్ మంజూరైనా ఆమె శనివారం విడుదల కానున్నారని జయ తరపు సీనియర్ న్యాయవాది బి. కుమార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News