: మన్మోహన్ పై నేరాభియోగాలు మోపలేం: సుప్రీంకోర్టు


యావత్తు దేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై నేరాభియోగాలు మోపలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు దాఖలైన పిిటిషన్ ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు నాటి కేంద్ర మంత్రులు శిబూ సోరెన్, శ్రీ ప్రకాశ్ జైస్వాల్ లపై నేరాభియోగాలు నమోదు చేయాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు కుంభకోణం వెలుగు చూసేందుకు కూడా ఎంఎల్ వర్మ పిటిషనే కారణం. మన్మోహన్ తదితరులపై అభియోగాలు మోపాలన్న పిటిషన్ ను శుక్రవారం పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News