: సహాయక చర్యలపై చంద్రబాబు అర్ధరాత్రి తనిఖీలు!


హుదూద్ తుఫాను కలిగించిన విలయాన్ని చక్కదిద్దేదాకా విశ్రమించేది లేదన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజంగానే కంటి మీద కునుకేయడం లేదు. రాత్రి పగలనే తేడా లేకుండా పనిచేసుకుపోతున్నారు. అధికారులను కూడా పనిచేయిస్తున్నారు. పగటి వేళ్లలో ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు అధికారులకు సలహాలు, సూచనలు చేస్తూ వెళుతున్న చంద్రబాబు, రాత్రి వేళల్లో సహాయక చర్యలను తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి విశాఖ రోడ్లపై చంద్రబాబు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. నగరంలో జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబు గురుద్వారా, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నడిరోడ్లపై విరిగిపడ్డ చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తదితర పనులను పరిశీలించారు.

  • Loading...

More Telugu News