: మొబైల్ ఏటిఎంల వద్ద బారులు
విశాఖపట్టణంలో మొబైల్ ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. హుదూద్ తుపాను ధాటికి సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో లేకపోవడంతో బ్యాంకులు, ఇతర కార్యాలయాలు స్థంభించిపోయాయి. ప్రజలు పునర్నిర్మాణ పనుల్లో నిమగ్నమైపోవడంతో పలు బ్యాంకులు మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేశాయి. దీంతో విశాఖపట్టణ వాసులు నగదు తీసుకునేందుకు వాటి దగ్గర బారులు తీరుతున్నారు.