: చిట్టితల్లి పిలిచినా పలకలేదని తల్లడిల్లిన పవన్ కల్యాణ్


కళాకారులు సున్నిత మనస్కులై ఉంటారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిరూపించాడు. తనను కలవాలనే కోరిక వెలిబుచ్చిన శ్రీజాను సంతృప్తి పరిచేందుకు పవన్ కల్యాణ్ దూరాభారం లెక్క చేయకుండా ఖమ్మం వెళ్లాడు. అక్కడ తనను చూసి శ్రీజా సంతోషిస్తుందని, చిన్నారితో కొంత సమయం గడిపి వెనుదిరగవచ్చని కూడా ఆశించాడు. పవన్ కల్యాణ్ ఊహించినట్టు అక్కడ జరగలేదు. చిన్నారి శ్రీజా ఆసుపత్రి బెడ్ పై స్పందించని స్థితిలో ఉంది. దీంతో 'నీ కోసమే వచ్చాను' అని తెలిపేందుకు పలుమార్లు శ్రీజా చెవివద్ద 'శ్రీజా...శ్రీజా' అంటూ పిలిచాడు. పాపలో ఎటువంటి స్పందన లేకపోవడంతో పవన్ కల్యాణ్ కంట కన్నీరు ఉబికివచ్చింది. పసి పిల్లకు ఇంత అనారోగ్యమా? అంటూ చలించిపోయాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెనుదిరిగాడు. వెనుదిరుగుతూ వారికి 2 లక్షల రూపాయల చెక్కు, బొమ్మలు ఇచ్చాడు. శ్రీజా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News