: వేలానికి పాప్ గాయని ప్రేమలేఖలు
అమెరికన్ పాప్ గాయని, పాటల రచయిత్రి కేటీ పెర్రీ తన బాయ్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ కు పదకొండేళ్లప్పుడు రాసిన ప్రేమలేఖలను అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ సంస్థ వేలానికి పెట్టనుంది. కాగా, ఇప్పుడు కేట్ పెర్రీ వయసు 29 ఏళ్లు. ఈ ప్రేమ లేఖలు 800 డాలర్లు పలకవచ్చని జూలియెన్స్ సంస్థ భావిస్తోంది. కేటీ పెర్రీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఎవరో ఒకరు వీటిని అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకుంటారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.