: సెబీ నిషేధంపై శాట్ ను ఆశ్రయించిన డీఎల్ఎఫ్
తమపై మూడు సంవత్సరాల నిషేధం విధిస్తూ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తీసుకున్న నిర్ణయంపై డీఎల్ఎఫ్ సంస్థ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ను ఆశ్రయించింది. ఈ మేరకు అభ్యర్థన పత్రాన్ని దాఖలు చేసింది. ఈ విషయాన్ని అప్పిలేట్ అధికార ప్రతినిధి, అటు డీఎల్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు. వచ్చే బుధవారం నాడు ఈ దరఖాస్తుపై శాట్ విచారణ జరపనుంది. 2007లో తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన డీఎల్ఎఫ్, తన అనుబంధ కంపెనీలతో పాటు కంపెనీ ఎదుర్కొంటున్న కేసులను ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని సీబీఐ విచారణలో తేలింది. దాంతో, సెబీ... డీఎల్ఎఫ్ తో పాటు సంస్థ ప్రమోటర్ కేపీ సింగ్ సహా ఆయన కొడుకు, కుమార్తె, మరో ముగ్గురు కంపెనీ ఉన్నతాధికారులను మూడు సంవత్సరాలు మార్కెట్ నుంచి బహిష్కరించింది.